కేటీఆర్ పర్యటన విజయవంతం చేద్దాం
NEWS Aug 30,2025 08:27 pm
సెప్టెంబర్ 10, 11 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రేగా కోరారు. శుక్రవారం కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.