కనీస వేతనాల కోసం సిఐటియు ఆందోళన
NEWS Aug 30,2025 12:15 pm
పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. కనీస వేతనాలు చెల్లించాలని, కూలీల హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ – ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వేతనాలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు నినాదాలు చేస్తూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.