గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
NEWS Aug 29,2025 02:05 pm
ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం నుంచి సెప్టెంబర్ 5 వరకు ట్రాఫిక్ అంక్షలు విధించారు పోలీసులు. ఎన్టీఆర్ మార్క్, పీపుల్స్ ప్లాజా, PVNR మార్క్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. కవాడిగూడ, బేగంపేట్, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తారు.