సాయి ధన్సికతో హీరో విశాల్ నిశ్చితార్థం
NEWS Aug 29,2025 01:40 pm
కోలీవుడ్ నటుడు విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆగస్టు 29న తన పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను ప్రేమించిన హీరోయిన్ సాయి ధన్సికతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గత మే నెలలో విశాల్, సాయి ధన్సిక తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను స్వయంగా ఎక్స్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవి హల్ చల్ చేస్తున్నాయి. సాయి ధన్సిక రజనీకాంత్ నటించిన కబాలి సినిమాలో నటించింది.