ఓటరు లిస్ట్ విడుదల.. మీ పేరు ఉందా?
NEWS Aug 30,2025 12:13 pm
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఈ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పౌరులు తమ జిల్లా, మండలం, గ్రామ వివరాలతో జాబితాను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చు. ఎవరైనా అభ్యంతరాలు తెలపాలనుకుంటే రేపటి వరకు అవకాశం ఉంది. జిల్లా పంచాయితీ అధికారి ఈ అభ్యంతరాలను ఈ నెల 31న పరిశీలిస్తారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 2న ప్రచురించబడుతుంది.