ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీగా జాబ్స్
NEWS Aug 29,2025 01:11 pm
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25 శాతం ఏపీ నుంచే ఉన్నాయని చెప్పారు. 2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా కల్చర్ కొనసాగుతోందన్నారు. రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ ప్రసిద్ధి పొందిందని పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.