అసాంఘిక శక్తులకు సహకరించకండి: సీఐ
NEWS Aug 30,2025 12:14 pm
ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మాట్లాడుతూ యువత అసాంఘిక శక్తులకు సహకరించి కేసుల పాలు కావద్దని సూచించారు. చదువులో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. వ్యసనాల బారిన బడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అన్నారు.