పెద్దపల్లిలో ఫేక్ నోటిఫికేషన్ కలకలం
NEWS Aug 29,2025 04:43 pm
నిరుద్యోగులను మోసం చేయడానికి కొంతమంది తప్పుడు ప్రకటనలు సోషల్ మీడియాలో విస్తరిస్తున్నారు. తాజాగా పెద్దపల్లిలో ఫేక్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన నిరుద్యోగులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై అన్న ప్రసన్న కుమారి స్పందిస్తూ – ఇప్పటివరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే ఉంటాయని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వాటిని నమ్మవద్దని సూచించారు.