కాంగ్రెస్ నాయకులు ఓటర్ జాబితా పరిశీలించండి: ఎమ్మెల్యే పాయం
NEWS Aug 30,2025 08:31 pm
స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా విడుదలైందని వెంటనే ఆ జాబితా పరిశీలించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. ఆగస్టు 29, 30, 31 తేదీలలో పార్టీ కార్యకర్తలు, నాయకులు జాబితాను సేకరించి గ్రామ స్థాయిలో ఓటర్ల వివరాలను ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. జాబితాలో ఏవైనా లోపాలు, అభ్యంతరాలు ఉంటే వాటిని ఆగస్టు 31లోపు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం తుది ఓటరు జాబితా సెప్టెంబర్ 2న విడుదల కానుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.