ఐఎంఎఫ్ ఏడీగా ఉర్జిత్ పటేల్
NEWS Aug 29,2025 11:00 am
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు ఉన్నత పదవి దక్కింది. ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆర్థిక రంగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఆయన అపాయింట్ అయిన నాటి నుంచి మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈమేరకు మోదీ ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. ఐఎంఎఫ్ లో 25 సభ్య దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలు ఏకగ్రీవంగా పటేల్ కు ఓకే చెప్పాయి.