మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్
NEWS Aug 29,2025 10:35 am
మోదీకి బిగ్ రిలీఫ్ దక్కేలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించి కలకలం రేపిన ఆయన ఉన్నట్టుండి మాట మార్చారు. తాను అలా ఎన్నడూ అనలేదంటూ బుకాయించారు. 75 ఏళ్లకే రిటైర్ కావాలని ఎవరికీ చెప్పలేదన్నారు. వయసు మళ్లాక కూడా శక్తి ఉంటుందని, తమకు చేతనైంత వరకు పని చేయొచ్చన్నారు. సంఘ్ ఎలా చెబితే అలా నడుచుకుంటామని స్పష్టం చేశారు.