యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష
NEWS Aug 29,2025 10:25 am
యాంకర్ లోబోకు బిగ్ షాక్ తగిలింది. ఏడాది జైలు శిక్ష విధించింది జనగామ కోర్టు. 2018లో తన కారులో హైదరాబాద్ వస్తుండగా నిడిగొండ వద్ద ఆటోను ఢీ కొట్టిన లోబో కారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మృతి చెందగా కేసు నమోదు చేశారు పోలీసులు. కేసును విచారించిన కోర్టు లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.12,500 జరిమానా విధించింది.