ప్రధాని మోదీ జపాన్ లో పర్యటన
NEWS Aug 29,2025 10:21 am
అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ జపాన్ కు చేరుకున్నారు. ఆయన రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జరిగే 15వ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరుపుతారు. జపాన్ తో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.