హైడ్రాకు హైకోర్టు అభినందన
NEWS Aug 29,2025 10:17 am
గత కొంత కాలంగా కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది తెలంగాణ హైకోర్టు హైడ్రాపై, ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ పై. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చి వేస్తారంటూ ప్రశ్నించారు. తాజాగా హైదరాబాద్ లోని రాంనగర్ లో రోడ్డును ఆక్రమించుకుని దర్జాగా నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని హైడ్రా కూల్చి వేసింది. దీనిపై సవాల్ చేస్తూ ఆక్రమణదారుడు కోర్టును ఆశ్రయించగా చీవాట్లు పెట్టింది. ఈ సందర్బంగా కమిషనర్ ను అభినందించింది.