విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు
NEWS Aug 29,2025 09:43 am
మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ వేదికగా జరిగిన జనసేన పార్టీ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి స్పందించారు. ఆరు నూరైనా సరే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం కానివ్వమని వెల్లడించారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కుండ బద్దలు కొట్టారని , ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.