ఆనాడు పార్టీని నడప లేడన్నారు
NEWS Aug 29,2025 09:20 am
తాను జనం కోసం జనసేన పార్టీని స్థాపించానని అన్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. జన సైనికులు భావావేశం, ఆలోచన ఉన్న వారని, యువత సామర్ధ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దన్నారు. ముమ్మాటికీ జనసేన బలం యువతే. ఈ పార్టీ ప్రారంభించినప్పుడు కొందరు రాజకీయవేత్తలు, విశ్లేషకులు ఈ పార్టీని నడపలేరంటూ ఎద్దేవా చేశారన్నారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి చూపించామన్నారు. ఇప్పుడు జనసేన సాధించిన గెలుపును చూసి అభిప్రాయాలను మార్చుకుంటున్నారని చెప్పారు.