రూ. 53,922 కోట్లతో 30 ప్రాజెక్టులకు ఆమోదం
NEWS Aug 29,2025 08:44 am
రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రూ. 53922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతీ నెలా సమీక్షస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.