ఫెన్షన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యత
NEWS Aug 29,2025 08:28 am
ఏపీ సీఎస్ విజయానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చూడాలన్నారు. ఒకవేళ ఎవరికైనా పెన్షన్ రాలేదంటే దానికి కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా, సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్షా 35 వేల మందికి నోటీసులు జారీ చేశామన్నారు. నెల రోజుల లోపు ఎంపీడీఓలకు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే సమాచార ఇచ్చామన్నారు.