బాధితులకు జాగృతి ఆధ్వర్యంలో సాయం
NEWS Aug 30,2025 11:14 pm
కామారెడ్డి జిల్లా రమేశ్వర్‌పల్లి డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు 48 గంటలుగా కరెంట్, ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొవడంతో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సహాయ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జాగృతి అధ్యక్షులు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో బాధితులకు 300 పులిహోర ప్యాకెట్లు, 300 వాటర్ బాటిల్స్, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వీరికి కరెంట్ సౌకర్యం కల్పించాలని డిఈతో మాట్లాడినట్లు సంపత్ గౌడ్ తెలిపారు. జిల్లా యువ నాయకులు జొన్నల రాము, జొన్నల వినోద్, మహిళా నాయకురాలు లలిత వసంత్ రావు, జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.