జర్నలిస్ట్ స్వామి ముద్దంను సత్కరించిన
ANN CEO కంది రామచంద్ర రెడ్డి
NEWS Aug 28,2025 03:10 pm
'ఆధునిక జర్నలిజం - కృత్రిమ మేధ' పుస్తకం రాసిన జర్నలిస్టు స్వామి ముద్దంను ANN ఛానల్స్ సీఈవో కంది రామచంద్ర రెడ్డి సత్కరించారు. ANN ఛానల్స్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోనే తొలిసారి AI జర్నలిజం పుస్తకం రాసిన స్వామి ముద్దంను కంది రామచంద్ర రెడ్డి అభినందించారు. ఆధునిక జర్నలిజంలో కృత్రిమ మేధపైన ఈ తరం జర్నలిస్టులకు ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ దయ్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు