ఓటర్ జాబితా అక్రమాలపై కమిటీ ఏర్పాటు
NEWS Aug 28,2025 04:44 pm
మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ఓటర్ జాబితాలో బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, డా. దాసోజు శ్రవణ్, లీగల్ సెల్ ఇంఛార్జ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏమైనా అనుమానాలు, అభ్యంతరాలు ఉంటే కమిటీ దృష్టికి తీసుకు రావాలని కోరారు