సీఎం పనితీరు దారుణం : హరీశ్ రావు
NEWS Aug 28,2025 04:35 pm
ఓ వైపు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సమీక్షల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేయడం దారుణమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన మెదక్ జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున పంటలు నీట మునగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోమ్ తగల బడుతుంటే ఫిడేల్ వాయించినట్లు ఉంది ముఖ్యమంత్రి తీరు అంటూ సీరియస్ అయ్యారు.