టీడీపీలోకి పాటూరి శ్రీనివాసులు రెడ్డి
NEWS Aug 29,2025 12:33 am
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో వైసీపీ సీనియర్ నేత పాటూరి శ్రీనివాసులు రెడ్డి టిడిపిలో చేరారు. ఆయనతో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక నాయకులు, అనుచరులు కూడా టిడిపిలోకి చేరారు. ఈ సందర్భంగా ముక్క రూపానంద రెడ్డి మాట్లాడుతూ – “పాటూరి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆయన అనుచరులు టిడిపిలో చేరడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వారి రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది” అని తెలిపారు.