గ్రామల్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పర్యటన
NEWS Aug 29,2025 12:31 am
ఇబ్రహీంపట్నం: భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ ఫకీర్‌కొండాపూర్, ఎర్ధండి గ్రామాలను సందర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలిపోయే దశలో ఉన్న ఇళ్లల్లోని వారు తక్షణమే మండల రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులు వాగులు, చెరువులు, గోదావరి పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని, వర్షాలు తగ్గే వరకు మోటార్ల వద్దకు వెళ్లవద్దని సూచించారు. వినాయక మండపాల వద్ద భక్తులు, యువకులు, మండలి సభ్యులు విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.