కోరుట్ల Dial 9100039255
మున్సిపల్ కమీషనర్ రవీందర్ సూచనలు
NEWS Aug 28,2025 08:26 am
కోరుట్ల పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ రవీందర్ సూచించారు. కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్లరాదు, శిథిలావస్థ ఇళ్లలో నివసించరాదని సూచించారు. గణేష్ మండపాలలో కరెంటు బోర్డులు తాకరాదు, కరెంటు సంబంధిత విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తీవ్ర వర్ష ప్రభావం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 9100039255 ను సంప్రదించవచ్చని తెలిపారు.