అవసరమైతే 100కు కాల్ చేయండి:
సీఐ అనిల్ కుమార్ సూచనలు
NEWS Aug 28,2025 01:21 pm
మెట్‌పల్లి: భారీ వర్షాల కారణంగా మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ అనిల్ కుమార్ సూచించారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దూరప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వరద ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. కరెంటు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.