ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: DSP రాములు
NEWS Aug 28,2025 01:11 pm
కోరుట్ల నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్‌పల్లి డీఎస్పీ రాములు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని, పాడైపోయే ఇళ్లలో ఉన్నవారు తప్పనిసరిగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100 నంబర్‌కు కాల్ చేయాలని లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.