ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం
NEWS Aug 28,2025 06:48 am
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో 32.33 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లాల కలెక్టర్లు. సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు.