కామారెడ్డిని ముంచెత్తిన వాన
NEWS Aug 28,2025 11:53 am
కామారెడ్డిలో మళ్లీ మొదలైంది వర్షం. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. రాజంపేటలో అత్యధికంగా 44 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 30 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా కామారెడ్డి చెరువుకు వరద ఉధృతి పెరిగింది. .జలదిగ్బంధంలో పలు కాలనీలు చిక్కుకున్నాయి. కామారెడ్డి-హైదరాబాద్ రూట్‌లో నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు. పలు రైళ్లు రద్దు చేశారు.