ఏపీలో సర్పంచ్ లకు గుడ్ న్యూస్
NEWS Aug 28,2025 11:35 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గత కొంత కాలంగా పెండింగ్ లో ఉన్నాయని, వీటిని రిలీజ్ చేయాలని నిర్ణయించామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు సెప్టెంబర్ తొలి వారంలో రిలీజ్ చేస్తామన్నారు. దీని వల్ల గ్రామ పంచాయతీలు మరింత బలోపేతం కానున్నాయని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమర్థంగా అందించాలన్నదే తమ సర్కార్ ఉద్దేశమన్నారు.