ప్రకాశం బ్యారేజ్ 69 గేట్లు ఎత్తివేత
NEWS Aug 28,2025 11:19 am
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద క్రమంగా పెరుగుతోంది వరద ప్రవాహం. వరద ఉధృతి మరింత పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 3.5 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్ 69 గేట్లు ఎఎత్తి దిగువకు 3.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద కారణంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.