పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
NEWS Aug 28,2025 10:57 am
భారీ వర్షాల నేపథ్యంలో నేడు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లా కలెక్టర్లు. కలెక్టర్ల ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను వర్షం ముంచెత్తడంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.