పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
NEWS Aug 28,2025 10:38 am
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని దెబ్బకు మెదక్, కామారెడ్డి జిల్లాలను ముంచెత్తాయి వర్షాలు. దీంతో సర్కార్ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పరిస్థితిని బట్టి మిగతా జిల్లాల్లో కూడా సెలవులు ఇవ్వాలని స్పస్టం చేశారు సీఎస్ రామకృష్ణా రావు.