ఆకట్టుకుంటున్న సీఎం గణేశ విగ్రహం
NEWS Aug 28,2025 10:34 am
వినాయక చవితి సందర్బంగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈసారి కూడా ఖైరతాబాద్ , బాలాపూర్ వినాయక విగ్రహాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. మరో వైపు వినాయక మండపాల నిర్వాహకులకు తీపి కబురు చెప్పింది సర్కార్. ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని పోలిన వినాయక విగ్రహాన్ని గోషా మహల్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిని చూసేందుకు భక్తులు క్యూ కట్టారు.