లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త
NEWS Aug 28,2025 10:34 am
ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. పొంగిపొర్లే నదులు, కాలువలు, వాగులు దాటడం , స్నానాలు చేయడం లాంటివి చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.