అవసరమైతే తప్పా బయటకు రావద్దు
NEWS Aug 28,2025 10:18 am
ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలు, మత్స్య కారులు అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు.