తెలంగాణ జిల్లాలు అతలాకుతలం
NEWS Aug 27,2025 11:10 pm
తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలను అసాధారణ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో కొన్ని గంటల్లోనే 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో పట్టణాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలోని రాజాంపేటలో రికార్డు స్థాయిలో 41.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.