ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పడిగెల
NEWS Aug 27,2025 09:09 pm
సదాశివనగర్, రామారెడ్డి మండలాల ప్రజలు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి సదాశివనగర్ మాజీ ZPTC పడిగెల రాజేశ్వరరావు, రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు 9 గ్రామాలకు సాగునీరు అందించే అడ్లూరుఎల్లారెడ్డి పెద్ద చెరువు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం నేషనల్ 44 హైవే వద్ద నీటి వర్ధన పరిస్థితులను కూడా పరిశీలించారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండి ముందుకు సాగాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలి నిరాశ్రయులైన బాధితులకు వెంటనే గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.