ముంబయి: కింగ్ సర్కిల్ ప్రాంతంలో జీఎస్‌బీ సేవా మండలి గణేశుడు దేశంలోనే ధనిక విగ్రహం. ఇక్కడ గణేశ్ మండపానికి ఏటా వందల కోట్లలో ఇన్సూరెన్స్ చేస్తారు. గతేడాది రూ.400.58 కోట్లు, ఈసారి ఉత్సవాలకు రూ.474.46 కోట్లతో ఇన్సూరెన్స్ చేశారు. గణపయ్యను 69 కేజీలకు పైగా బంగారం, 336 కేజీలకు పైగా వెండి, ఇతర విలువైన ఆభరణాలతో అలంకరించారు. అదంతా భక్తులు, దాతలు కానుకగా ఇచ్చిందే. ఈ గణేషుడిని దర్శించుకోవడానికి సామాన్య భక్తులతో పాటు, ప్రముఖులు భారీగా తరలివస్తారు.