పెద్దాపూర్ కెనాల్‌లో ట్రాక్టర్ బోల్తా
మాజీ ZPTC కుమారుడు గల్లంతు
NEWS Aug 27,2025 06:21 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పెద్దాపూర్ కెనాల్‌లో గణపతి తీసుకువెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పెడపూర్ మాజీ ZPTC శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్రీకర్ గల్లంతైనట్టు సమాచారం. ట్రాక్టర్‌లో నలుగురు ఉండగా, రామారావుపల్లె వైపు వెళ్తూ కెనాల్‌లో బోల్తా పడినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.