భారీ వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. మెదక్ జిల్లాలోని హవేలి ఘనపూర్ మండలం నాగపూర్ నక్క వాగు ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఎంత మంది ఉన్నారనేది వివరాలు తెలియాల్సి ఉంది. కారులో వెళ్తూ అందులో ఉన్న నరేందర్ గౌడ్ వాగులో చిక్కుకున్నారు. కాపాడటానికి రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందం దిగాయి. ఘటన స్థలానికి ఎస్పీ శ్రీనివాస రావు చేరుకున్నారు.