కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో
మట్టి గణపతి ప్రతిష్ట
NEWS Aug 27,2025 01:01 pm
కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, పర్యావరణ కాలుష్య నివారణ, మొక్కలు నాటడం, తడి–పొడి చెత్త వేరు చేయడం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. పట్టణంలో మట్టి గణపతులను ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.