కాశ్మీర్ - కన్యాకుమారి రాక పోకలు బంద్
NEWS Aug 27,2025 01:00 pm
భారీ వర్షాల కారణంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారీకి వెల్లే 44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు బంద్ చేశారు. నార్సింగి వద్ద హైవేపై భారీగా వరద నీరు చేరింది. చెరువును తలపిస్తోంది నేషనల్ హైవే. వాహనాలు వరదలో కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో పూర్తిగా నిలిపి వేశారు పోలీసులు