అంగన్ వాడీ కార్యకర్తలకు శుభవార్త
NEWS Aug 27,2025 05:11 pm
ఏపీ సర్కార్ అంగన్ వాడీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పింది. నెలరోజుల్లో అంగన్ వాడీ కార్యకర్తలకు కొత్త సెల్‍ఫోన్లు అందజేస్తామని ప్రకటించింది. అంగన్ వాడీల్లో ఇండక్షన్ స్టవ్ వినియోగానికి వీలుగా నెలకు రూ.500 చొప్పున విద్యుత్ ఛార్జీలు చెల్లించనున్నట్లు తెలిపింది. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి అంగన్ వాడీలను వినియోగించ రాదని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.