వినాయకుడికి పూజలు చేసిన జగన్
NEWS Aug 27,2025 01:01 pm
వినాయక చవితి పండుగ సందర్బంగా వైఎస్సార్సీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగి పోవాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలిగించేలా చూడాలని గణేశుడిని ప్రార్థించారు.