పినపాకలో సిసి రోడ్ల ప్రారంభం
NEWS Aug 27,2025 03:45 pm
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామ గ్రామానికీ రహదారులు ఏర్పాటు చేస్తామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.