వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.