‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. 2 భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఒకే భాగంగా ఈ ఏడాది అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ విడుదల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభాస్, అనుష్క, రానా, నటీనటులు, దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు.