బార్ అసోసియేషన్ గణపతి పూజ
NEWS Aug 27,2025 02:30 pm
వినాయక చవితి సందర్భంగా మెట్‌పల్లి బార్ అసోసియేషన్ కార్యాలయంలో మట్టి వినాయకుడి ప్రతిమను నెలకొల్పి పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని ప్రతిష్ఠించామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి తెలిపారు. ప్రసాదం, అన్నదానం కార్యక్రమాల్లో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామన్నారు. విధుమౌళి శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, న్యాయవాదులు వెల్మల స్వప్నరావు, కాజీపేట స్రవంతి, ఆకుల మానస, మగ్గిడి వెంకట నర్సయ్య, పి. దయాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.