మెట్‌పల్లి పట్టణంలో ముసుగు దొంగలు?
NEWS Aug 27,2025 01:13 pm
మెట్‌పల్లిలో ముసుగు దొంగలు తిరుగుతున్నారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగస్టు 26 అర్ధరాత్రి పట్టణంలోని ఒక ఇంటి సీసీ కెమెరాలో ముసుగు దొంగల కదలికలు రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళన, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియో నిజంగా మెట్‌పల్లి పట్టణానికి సంబంధించినదేనా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు పూర్తి స్థాయి పరిశీలన జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సి ఉంది.